ఆర్మీ ఉన్నతాధికారులతో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ భేటీ

Wed,February 27, 2019 07:49 PM

punjab cm amarindersingh review with army officials


జలంధర్ : బాలాకోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడులకు ప్రతిగా ఇవాళ ఉదయం పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు భారత గగన తలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులు, పారామిలటరీ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సరిహద్దు వెంట తీసుకుంటున్న భద్రతా చర్యలపై భద్రతాదళ అధికారులతో సమీక్షించారు.

2828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles