మోదీ ప్రమాణ‌స్వీకారోత్స‌వానికి పంజాబ్ సీఎం దూరం

Thu,May 30, 2019 12:26 PM

Punjab CM Amarinder Singh not to attend PM Modi swearing ceremony

హైద‌రాబాద్‌: న‌రేంద్ర మోదీ ఇవాళ ప్ర‌ధానిగా రెండ‌వ‌సారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే ఈ వేడుక‌లో పాల్గొనేందుకు సుమారు 8 వేల మంది అతిథులు వ‌స్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ప్ర‌మాణోత్స‌వం జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ వెళ్ల‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం మీడియా అడ్వైజ‌ర్ స్ప‌ష్టం చేశారు. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వెళ్ల‌డం లేదు. మోదీతో పాటు కొంద‌రు క్యాబినెట్ మంత్రులు కూడా ఇదే వేడుక‌లో ప్ర‌మాణం చేయ‌నున్నారు. అయితే సాయంత్రం 5 గంట‌ల‌కే క్యాబినెట్‌కు ఎన్నికైన ఎంపీలు మోదీని క‌ల‌వ‌నున్నారు. మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు ఊ విన్ మింట్‌, శ్రీలంక అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన‌, థాయిల్యాండ్ అంబాసిడ‌ర్ ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు.

1211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles