శృంగారం చేయలేదని యువకుడి దాడి

Mon,September 24, 2018 04:08 PM

Pune man stabs boyfriend allegedly over excessive demand of sex

పుణె : ఒకాయన వయసు 46 ఏళ్లు.. ఈ వ్యక్తి వయసుకు సరిగ్గా సగం వయసున్న 23 ఏళ్ల యువకుడు.. వీరిద్దరి మధ్య గత రెండేళ్ల నుంచి స్వలింగ సంబంధం ఉంది. అయితే వీరిద్దరూ తరుచుగా కలుస్తుండేవారు. ఎంజాయ్ చేసేవారు. కానీ ఇటీవలే ఒకేసారి శృంగారం చేసి.. రెండోసారి చేసేందుకు 46 ఏళ్ల పెద్దాయన అంగీకరించలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన 23 ఏళ్ల యువకుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 19న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు ఖడక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పెద్దాయన వ్యాపారవేత్త కాగా, యువకుడు ఓ హోటళ్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

19397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles