టోల్ ప్లాజాలో కార్డు స్వైప్.. రూ.87 వేలు మాయం

Tue,September 12, 2017 03:56 PM

Pune man loses Rs 87000 after swiping at Pune Mumbai toll plaza

ముంబై: టోల్ ప్లాజాలో కార్డు స్వైప్ చేసిన పుణె వ్య‌క్తికి ఘోర‌మైన షాక్ త‌గిలింది. టోల్ గేట్ వ‌ద్ద డెబిట్ కార్డు స్వైప్ చేసిన అత‌ను ఆ త‌ర్వాత త‌న‌ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డ‌బ్బును కోల్పోయాడు. సుమారు 87 వేల రూపాయ‌లు అత‌ని అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. 36 ఏళ్ల ద‌ర్శ‌న్ పాటిల్ సెప్టెంబ‌ర్ 9న పుణెకు వెళ్తూ ఖాలాపూర్ టోల్ ప్లాజా ద‌గ్గ‌ర త‌న డెబిట్ కార్డును స్వైప్ చేశాడు. అయితే అప్పుడు అత‌ను కేవ‌లం 230 రూపాయిలు మాత్రం టోల్ టికెట్ క‌ట్టాడు. కానీ ఆ రోజు రాత్రిలోగా అత‌ని అకౌంట్ నుంచి మొత్తం రూ.87 వేలు క‌ట్ అయ్యాయి. వేర్వేరు స‌మ‌యాల్లో అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్ అయిన‌ట్లు అత‌ని మొబైల్‌కు మెసేజ్‌లు వ‌చ్చాయి. దీనిపై హ‌ర్దాస్ పోలీస్ స్టేష‌న్‌లో ద‌ర్శ‌న్ ప‌టేల్ ఫిర్యాదు చేశాడు. టోల్ ప్లాజాలో డెబిట్ కార్డు వాడ‌డం వ‌ల్ల సైబ‌ర్ నేర‌స్తులు దాన్ని హ్యాక్ చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

1796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles