159 రోజుల్లో 29 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కిన యువతి

Wed,December 26, 2018 01:35 PM

Pune Girl Becomes Fastest Asian to Cycle Around the Globe

వేదంగి కుల్‌కర్ణి.. వయసు 20 ఏళ్లు. ఊరు పూణె. ఉండేది మాత్రం యూకేలో. అక్కడ బౌర్నెమౌత్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తోంది. ఎప్పుడూ సాహసాలు చేయడం.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటం తనకు చాలా ఇష్టం. అందుకే 2018 సంవత్సరాన్ని స్పెషల్ ఇయర్ చేయాలనుకుంది. అందుకే.. ఓ రిజల్యూషన్ తీసుకుంది. 130 రోజుల్లో 29 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి అని అనుకున్నది. రెండేళ్ల క్రితమే ఇలా సైకిల్ మీద యాత్ర చేయాలనుకున్నది. కానీ.. 2018లో తనకు వీలు కుదరిందట. దీంతో తన సైకిల్ యాత్రను ప్రారంభించింది. కాకపోతే 159 రోజుల్లో 29 వేల కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీద పూర్తి చేసింది. తనేదో సరదాకు ఈ ఫీట్ చేస్తే.. అది రికార్డు అయింది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కిన ఏషియన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. తన జర్నీ మొత్తంలో 14 దేశాలను కవర్ చేసింది వేదంగి.

తన సైకిల్ యాత్ర ఏమీ.. రెడ్ కార్పెట్ కాలేదు తనకు. మధ్యలో ఎన్నో అవాంతరాలు... ఒకసారి కెనెడాలో ఉన్నప్పుడు ఓ ఎలుగుబంటి తనను వెంబడించిందట. దాని నుంచి ఎలాగోలా తప్పించుకున్నదట వేదంగి. స్పెయిన్‌లో దోపిడీ దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారట. ఒక్కోసారి -20 నుంచి 37 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోవాల్సిన వచ్చేదట వేదంగికి. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నది వేదంగి. అందుకే అటువంటి ఘటనలు తనను ఏమీ చేయలేకపోయాయి.

పెర్త్‌లో తన సైకిత్ యాత్రను ప్రారంభించి... ఆస్ట్రేలియా నుంచి బ్రిస్బేన్ ద్వారా న్యూజిలాండ్ వెళ్లింది వేదంగి. అక్కడ కెనడాకు విమానంలో వెళ్లి కెనడాలోని హలీఫాక్స్ నుంచి మళ్లీ తన సైకిల్ యాత్రను కొనసాగించింది వేదంగి. అక్కడి నుంచి యూరప్ వెళ్లింది. ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, డెన్‌మార్క్, స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు విమానంలో వచ్చి.. ఇండియాలో 4000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసింది. అలా తన యాత్రను ఇండియాలో ముగించేసింది వేదంగి. తన యాత్రకు సంబంధించి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేస్తుండేది వేదంగి.

2046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles