పుల్వామా దాడితో సంబంధం ఉన్న ఉగ్ర‌వాది అరెస్టు

Fri,March 22, 2019 02:52 PM

Pulwama resident Sajjad Khan allegedly affiliated with Jaish held in south Delhi

హైద‌రాబాద్: జ‌మ్మూక‌శ్మీర్‌లో పుల్వామా దాడికి ప్లాన్ వేసిన సూత్ర‌ధారి ముద‌సిర్ అహ్మ‌ద్ ఖాన్‌కు స‌హ‌క‌రించిన జైషే వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ద‌క్షిణ ఢిల్లీలో గ‌త రాత్రి ఈ అరెస్టు జ‌రిగింది. పుల్వామా జిల్లాకు చెందిన స‌జ్జ‌ద్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ దాఖ‌లు చేసిన కేసులో.. స‌జ్జ‌ద్ ఖాన్ ఉన్నాడు. ఉగ్ర‌వాది స‌జ్జ‌ద్‌ను పోలీసులు కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టారు. పుల్వామా దాడికి సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించిన ముద‌సిర్ అహ్మ‌ద్ ఖాన్‌ను ఇటీవ‌ల పోలీసులు ఎన్‌కౌంట‌ర్‌లో షూట్ చేసిన విష‌యం తెలిసిందే.

1627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles