కత్తిపోట్లకు దారితీసిన పబ్‌జీ గేమ్ వ్యసనం

Fri,February 15, 2019 06:35 PM

PUBG AGGRESSION LEADS TO STABBING IN MUMBAI

పబ్‌జీ అనేది ఇప్పుడు యూత్‌కు ఓ వ్యసనంలా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆ గేమ్‌తో గంటగంటలు గడిపేవారున్నారు. ఈ పాపులర్ ఆన్‌లై గేమ్ ముంబైలో కత్తిపోట్లకు దారితీసింది. ఓ యువకుడు గేమ్‌కు ఏర్పడిన అవాంతరాన్ని తట్టుకోలేక విసుగుతో తన కాబోయే బావనే కత్తిపోట్లకు గురిచేశాడు. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటన ఆలసంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కల్యాణ్ (ఈస్ట్) ప్రాంతంలో నివసించే నిందితుడు రజనీశ్ రాజ్‌భర్ (27) పబ్‌జీ ఆడుతుండగా మధ్యలో సెల్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అయింది. చార్జర్‌కోసం హడావిడిగా వెదికితే దాని వైర్ తెగిపోయి ఉంది. అది తన సోదరి పనేనని అనుమానించి నిందించడం మొదలుపెట్టాడు. ఆమె తాను చార్జర్‌ను ఏమీ చేయలేదని ఎంతమొత్తుకున్నా వినలేదు. తన ఆట ఆగిపోవడానికి సోదరి నిర్వాకమే కారణమని చిందులు వేశాడు. ఆమె ల్యాప్‌టాప్ వైర్ కోసేశాడు. ఇది చూసిన కాబోయే బావ ఓమ్ బావ్‌దాంకర్ (32) అడ్డువచ్చాడు. కేవలం గేమ్ కోసం ఇలా చిందులు తొక్కడిం బాగాలేదని చివాట్లు పెట్టాడు. దాంతో కోపం పట్టలేక తనిపై కత్తితో దాడి చేశాడు. పొట్టలో పొడిచాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఓమ్ కోల్సేవాడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతనెల 11 ఏళ్ల ముంబై బాలుడు అహద్ నిజాం పబ్‌జీని బ్యాన్ చేయాలంటూ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అహద్ తన తల్లి ద్వారా ఈ పిల్ దాఖలు చేశాడు. గేమ్ వల్ల ఇహంస ప్రబలుతున్నదని అందులో పేర్కొన్నాడు. ఇటీవల పబ్‌జీ గేమ్ ఆడుకోవడానికి తల్లిదండ్రులు ఖరీదైన ఫోన్ కొనివ్వలేదని ముంబైలోనే మరో బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజా ఘటనతో పబ్‌జీ ప్రబావంపై మరోసారి చర్చ మొదలైంది.

2716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles