ఈశాన్య రాష్ర్టాల్లో రిపబ్లిక్ డే వేడుకల బహిష్కరణ

Sat,January 26, 2019 11:23 AM

Protests In Northeast Over Citizenship Bill Boycott Republic Day Events

హైదరాబాద్ : పౌరసత్వ(సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ర్టాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ర్టాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు అక్కడి ప్రజలు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles