ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలే బెటర్..

Wed,June 6, 2018 11:57 AM

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మంత్రి సురేంద్ర సింగ్ తన తీరు మార్చుకోవడం లేదు. ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారుల కన్నా వేశ్యలే మేలు అని ఆయ‌న తాజాగా విమ‌ర్శ‌లు చేశారు. ఎవరైనా లంచం అడిగితే.. వాళ్లకు ఓ పంచ్ ఇవ్వాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారుల కంటే వేశ్యలే బెటర్ అని, ఎందుకుంటే వాళ్లు డబ్బులు తీసుకుని పని చేస్తారు, స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేస్తారు, కానీ అధికారులు మాత్రం డబ్బులు తీసుకున్నా.. పనిమాత్రం చేయరని అన్నారు. మంత్రి సురేంద్ర సింగ్ గతంలోనూ అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలెవ్వరూ నోరు జారవద్దు అని ప్రధాని మోదీ హితువు పలికినా.. యూపీ మంత్రి మాత్రం పదేపదే తన సహజ శైలిని ప్రదర్శిస్తున్నారు. అత్యాచారాలు పెరగడానికి పేరెంట్స్, మొబైల్ ఫోన్లు కారణం అంటూ గతంలో ఈయనే వివాదాస్పద కామెంట్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని శూర్పనక‌ అని కూడా విమర్శించారు.

2617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles