చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ నిషేధిత క్రీడాఉత్ప్రేరకాలు

Mon,September 16, 2019 07:04 PM

చెన్నై: కలకత్తాకు చెందిన 46 ఏళ్ల వ్యక్తి నిషేధత క్రీడా ఉత్ప్రేరకాలతో చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. అతడు తీసుకొచ్చిన ఉత్ప్రేరకాల(డ్రగ్స్‌) విలువ 10 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కస్టమ్స్‌ చట్టం కింద సీజ్‌ చేశారు. అతడు కాంబోడియా నుంచి కౌలాలంపూర్‌ మీదుగా చెన్నై వచ్చాడని అధికారులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి, విచారిస్తామని వారు తెలిపారు.

446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles