కార్య‌క‌ర్త‌ల‌కు వార్నింగ్ ఇచ్చిన ప్రియాంకా గాంధీ !

Thu,June 13, 2019 12:07 PM

Priyanka lashes out at Congress workers over Lok sabha election drubbing

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ.. యూపీలోని రాయ‌బ‌రేలీలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఓట‌మిపై ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. త‌న‌లో ఉన్న అస‌హ‌నాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్య‌కర్త‌ల‌పై చూపించారు. కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోయింద‌న్నారు. త‌ల్లి సోనియా గాంధీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాయ్‌బ‌రేలీలో.. అసంతృప్తితోనే ప్రియాంకా మాట్లాడారు. నిజాలు మాట్లాడుతాన‌ని, త‌న మాట‌లు క‌ఠినంగా ఉంటాయంటూనే ఆమె ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ తూర్పు యూపీ ఇంచార్జీగా ప్రియాంకా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. పార్టీ కోసం ప‌ని చేయ‌ని కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించ‌నున్నట్లు ఆమె చెప్పారు. మ‌త‌ప‌ర‌మైన ఉద్దేశంతో ప‌నిచేసిన వారి గురించి తెలుసు, కానీ పార్టీ గురించి ప‌నిచేయ‌ని కార్య‌క‌ర్త‌ల గురించి తెలుసుకుంటాన‌న్నారు. యూపీలోని రాయ్‌బ‌రేలీలో మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అమేథీ నుంచి రాహుల్ ఓడిన విష‌యం తెలిసిందే.

1862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles