రాహుల్ ఇంటికి క్యూక‌ట్టిన నేత‌లు..

Tue,May 28, 2019 01:17 PM

Priyanka Gandhi visits Congress Chief Rahul Gandhi house

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న‌ది. పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని రాహుల్ భీష్మించారు. దీంతో ఆ పార్టీ నేత‌లంతా రాహుల్‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇవాళ రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో పాటు సోద‌రి ప్రియాంకా గాంధీ వ‌ద్రా కూడా రాహుల్‌ను క‌లిశారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో స‌మూల ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాల‌ని రాహుల్ భావిస్తున్నారు. దానికి సీనియ‌ర్ల అండ కూడా ల‌భిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4.30 నిమిషాల‌కు పార్టీ సీనియ‌ర్ల‌తో రాహుల్ స‌మావేశంకానున్నారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రాహుల్ మొండిగా సిద్దమయ్యారు. పార్టీ ప‌గ్గాల‌ను ప్రియాంకాకు అప్ప‌గిస్తారా అన్న అభిప్రాయాన్ని రాహుల్ కొట్టివేసిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఆ పార్టీకి చెందిన బ‌డా నేత‌లు క్యూక‌ట్టారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు కార‌ణ‌మైన ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్‌పై రాహుల్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అశోక్ గెహ్లాట్‌ను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని రాహుల్ భావిస్తున్నారు. ఇదే అంశంపై చ‌ర్చించేందుకు గెహ్లాట్ ఇవాళ రాహుల్ ఇంటికి వెళ్లారు. ఒక‌వేళ రాహుల్ రాజీనామాను అంగీక‌రిస్తే, మ‌రి పార్టీ ప‌గ్గాలను ఎవ‌రు తీసుకుంటార‌న్న దానిపై క్లారిటీ లేదు. పార్టీ బాధ్య‌త‌లు ప్రియాంకా తీసుకుంటారా లేక గాంధీయేత‌ర నేత‌లు ఎవ‌రైనా ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తారా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

3630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles