రేపు ఉత్తరప్రదేశ్‌కు ప్రియాంక గాంధీ

Mon,June 10, 2019 01:20 PM

Priyanka Gandhi to visit Raebareli for first time after Congress poll debacle

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ నెల 11న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ గెలుపొందారు. ఈ ఘోర ఓటమికి గల కారణాలపై పార్టీ నాయకులతో ప్రియాంక 11వ తేదీన చర్చించనున్నారు. ఈ సమావేశానికి జ్యోతిరాధిత్య సింధియా కూడా హాజరు కానున్నారు. అమేథిలో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక యూపీ విషయానికి వస్తే బీజేపీ 64, బీఎస్పీ 10, ఎస్పీ 5, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది.

1199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles