ప్రియాంకా గాంధీ ఇంట్లోకి దూసుకువెళ్లిన కారు..

Mon,December 2, 2019 05:48 PM

హైద‌రాబాద్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీ ఇంటి వ‌ద్ద సెక్యూర్టీ ఉల్లంఘ‌న జ‌రిగింది. ఎస్పీజీ భ‌ద్ర‌త ఎత్తివేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. అయిదుగురు వ్య‌క్తులు ఉన్న ఓ కారు నేరుగా ప్రియాంకా ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ సంఘ‌ట‌న న‌వంబ‌ర్ 26వ తేదీన జ‌రిగింది. కారులో వ‌చ్చిన ఓ బృందం ప్రియాంకాతో ఫోటోలు కూడా దిగిన‌ట్లు ఆమె ఆఫీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మ‌ధ్య ప్ర‌త్యారోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌వ‌ని, అధికారుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles