అన్న పక్కనే చెల్లి.. కాంగ్రెస్ బిల్డింగ్‌లో ప్రియాంకా ఆఫీస్

Tue,February 5, 2019 02:40 PM

Priyanka Gandhi gets room in Congress headquarters in 24 Akbar Road Delhi

న్యూఢిల్లీ: ఈ మధ్యే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ గదిని కేటాయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇదే కార్యాలయంలో ఉన్నారు. అంతకుముందు ఈ గది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, సుశీల్‌కుమార్ షిండెల కార్యాలయంగా ఉండేది. గత నెలలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాను రాహుల్ నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. యూపీ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్‌చార్జ్‌ను చేశారు.


అయితే యూపీని మించి జాతీయ స్థాయిలో ఆమె పాత్ర ఉంటుందని రాహుల్ మంగళవారం స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే.. కచ్చితంగా అది జాతీయ స్థాయి పాత్రే అని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం రాహుల్‌తో ప్రియాంకా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గురువారం వివిధ రాష్ర్టాల ఇన్‌చార్జ్‌లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఆమె పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను కాంగ్రెస్ రచించనుంది.

2148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles