గంగా న‌దిపై.. క‌దిలిన ప్రియాంకా బోటు

Mon,March 18, 2019 12:07 PM

Priyanka Gandhi begins ganga yatra from Prayagraj

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత‌, ఈస్ట్ యూపీ ఇంచార్జ్ ప్రియాంగా గాంధీ.. మూడు రోజుల గంగా యాత్ర‌ను ప్రారంభించారు. దీంతో ఆమె లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద ఆమె బోటు ఎక్కారు. సుమారు 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ఆమె బోటో ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. వార‌ణాసిలోని అసి ఘాట్ వ‌ద్ద ప్రియాంకా ప్ర‌చారం ముగుస్తుంది. ఇవాళ ఉద‌యం ప్ర‌యాగ్‌రాజ్‌లో.. హనుమాన్ ఆల‌యంతో పాటు త్రివేణి సంగ‌మంలో ప్రియాంకా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. యూపీలో కాంగ్రెస్‌కు పున‌ర్ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఈ సంద‌ర్భంగా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. స‌త్యానికి, స‌మానాత్వానికి ప‌విత్ర గంగా న‌దియే సాక్ష్య‌మ‌ని, ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు గంగా న‌దిపైనే ఆధార‌ప‌డి ఉన్నార‌ని, నేను కూడా గంగా న‌ది ప్ర‌వాహంలో మీతో క‌లిసిపోనున్న‌ట్లు ప్రియాంకా గాంధీ ఓ లేఖ‌లో తెలిపారు.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles