పోలీసులపై దాడి చేసి పారిపోయిన ఖైదీ.. వీడియో

Tue,September 11, 2018 01:58 PM

మధ్య ప్రదేశ్ లోని భిండ్ పోలీస్ స్టేషన్‌లో దారణ ఘటన చోటు చేసుకున్నది. అండర్ ట్రయల్స్‌లో ఉన్న ఓ ఖైదీ క్రూరంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి ఇద్దరు పోలీస్ గార్డులపై విచక్షణారహితంగా తన దగ్గర ఉన్న ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఇద్దరు పోలీస్ గార్డులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం ఆ ఖైదీ అక్కడి నుంచి పారిపోయాడు. ఒక పోలీస్‌ను ట్రీట్‌మెంట్ కోసం ఢిల్లీకి తరలించగా.. మరో వ్యక్తిని భిండ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles