స్కూల్ ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన స్టూడెంట్

Sat,January 20, 2018 04:37 PM

Principal of a School in haryana has been shot dead by a class 12th student

ఓ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపల్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్‌లో గల స్వామి వివేకానంద పాఠశాలలో ఈ మధ్యాహ్నం చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తుపాకితో ప్రిన్సిపల్‌ రీతూ ఛబ్రా ఆఫీస్ గదిలోకి ప్రవేశించి విచక్షణారహితంగా ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు టీచర్స్-పేరేంట్స్ మీటింగ్ జరుగుతుంది. బుల్లెట్లు ముఖం, భుజం, ఛాతిలో నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే తీవ్రగాయాలపాలై ఆమె చనిపోయింది. విద్యార్థి తన తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నిందితుడి తండ్రి ఫైనాన్షియర్. తల్లిదండ్రుల్లోని ఒకరితో పాటు స్కూల్ సిబ్బంది విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థి చదువుల్లో చాలా మందబుద్ది. దీంతో ప్రిన్సిపల్‌ అతన్ని తిడుతుండేదని.. కక్ష్య పెంచుకున్న విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ తెలిపారు. విద్యార్థికి ఈ మధ్యనే 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. విద్యార్థితో పాటు అతని తండ్రిపై హత్య, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles