విద్యార్థిపై వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్

Wed,January 31, 2018 11:52 AM

Principal assaulted 13 years old School Boy


గోవా: 13 ఏళ్ల విద్యార్థిపై స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడిన ఘటన మార్గావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లయోలా హైస్కూల్ ప్రిన్సిపాల్ సదరు విద్యార్థితోపాటు మరో ఇద్దరు విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు పంపించాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ బయటకు వచ్చి విద్యార్థి మొఖం, తలపై కొట్టాడు. ప్రిన్సిపాల్ ఎలాంటి కారణం లేకుండా తీవ్రంగా కొట్టడంతో తమ కుమారుడు భయంతో వణికిపోతున్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి కపిల్ నాయక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని వెల్లడించారు.

1634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles