బద్రీనాథ్‌ను దర్శించుకున్న ప్రధాని మోదీ

Sun,May 19, 2019 11:12 AM

Prime Minister Narendra Modi after offering prayers at Badrinath Temple in Uttarakhand

బద్రీనాథ్‌(ఉత్తరాఖండ్‌): రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌ రాష్ర్టానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఆదివారం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాటపట్టారు. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆధ్యాత్మిక వేషధారణలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ బద్రీనాథ్‌లోని నారాయణుడిని మోదీ దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులకు మోదీ అభివాదం చేశారు. అంతకుముందు ఆలయ పూజారులు, అధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. శనివారం హిమాలయక్షేత్రం కేదార్‌నాథ్‌లోని కేదారీశ్వరుడిని మోదీ దర్శించుకొని.. కేదార్‌ గుహలో 12 గంటల పాటు ధ్యానం చేసిన విషయం తెలిసిందే.676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles