ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్

Mon,June 19, 2017 07:21 AM

జూలై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఆకుపచ్చ, శాసనసభ్యులు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఎన్డీయే, విపక్షాలు తమ తమ అభ్యర్థులను ప్రకటించి జూలై1కల్లా ఎవరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోని పక్షంలో పోటీ అనివార్యమవుతుంది కనుక బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌కు ఎన్నికల కమిషన్ సిద్ధమవనుంది. బ్యాలెట్ పేపర్లను వేర్వేరు రంగులతో పాటు 14 హిందీపాలిత రాష్ర్టాల్లో ఇంగ్లిష్‌తోపాటు హిందీలోనూ ముద్రించాలని ఎన్నికల కమిషన్ రాష్ర్టాలను ఆదేశించింది.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ర్టాల్లో ఆంగ్లంతోపాటు ప్రాంతీయభాషలోనూ బ్యాలెట్ పత్రాలను ముంద్రించనున్నారు. ఓవైపు డిజిటల్ చెల్లింపులపై కేంద్రం ఒత్తిడి తెస్తుండగా, మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం నగదు చెల్లింపులే జరుగనున్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఒక్కో అభ్యర్థి డిపాజిట్ కింద రూ.15వేలు నగదు రూపంలోనే రిటర్నింగ్ అధికారికి చెల్లించాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బ్యాంకు అధికారి కూడా ఒకరుంటారని, ఆయనే నోట్లను లెక్కించి తీసుకుంటారని సమాచారం.

520

More News

మరిన్ని వార్తలు...