రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..ఓటేసిన మోదీ, కేసీఆర్



Mon,July 17, 2017 10:09 AM

Presidential polling begins

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అటు పార్లమెంట్ లో ఇటు తెలంగాణ శాసనసభలోనూ ఎన్నికల ప్రక్రియను పోలింగ్ అధికారులు ప్రారంభించారు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో మోదీ తొలి ఓటు వేశారు. శాసనసభలో కేసీఆర్ తొలి ఓటు వేయగా.. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఓటేశారు. అధికార ప‌క్షాన‌ రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సెల్‌ఫోన్‌లు, పెన్నులను అధికారులు పోలింగ్ బుత్‌లోకి అనుమతించడం లేదు.





2995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS