ఓటేసిన ప్రముఖులు

Sun,May 12, 2019 04:23 PM

President Ram Nath Kovind, Wife Savita Cast Vote In Delhi

న్యూఢిల్లీ: ఆరోదశ ఎన్నికల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు రాష్ర్టాల్లోని 59 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటు హక్కు కలిగిన రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఓటు వేశారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు రాష్ట్ర‌ప‌తి కూడా వ‌రుస‌లో నిల్చోవ‌డం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషా ఢిల్లీలో ఓటేశారు.

ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, తూర్పు ఢిల్లీ ఆప్‌ అభ్యర్థి అతిషీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, యూపీఏ ఛైరపర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రా, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారాత్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీరేందర్‌ సింగ్‌ ధనోవా, తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరో విడుత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 51.48శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles