గాంధీ శాంతి బహుమతుల ప్రదానం

Tue,February 26, 2019 11:49 AM

President Ram Nath Kovind presents Gandhi Peace Prize

న్యూఢిల్లీ: గాంధీ శాంతి బహుమతుల ప్రదానం నేడు జరిగింది. 2015, 2016, 2017, 2018 సంవత్సరానికిగాను గ్రహీతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2015కు గాను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర, 2016కు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్‌ అండ్‌ సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా, 2017కు గాను ఎకల్‌ అభియాన్‌ ట్రస్ట్‌ అదేవిధంగా 2018కు గాను యోహియ్‌ ససాకవాలు అవార్డుకు ఎంపికయ్యారు. అహింసా పద్ధతిలో, గాంధీయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గాంధీ శాంతి బహుమతిని అందజేస్తుంది.536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles