లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ కుమార్‌కు ఉత్త‌మ యుద్ధ‌ సేవా మెడ‌ల్‌

Tue,March 19, 2019 11:08 AM

President Ram Nath Kovind confers Uttam Yudh Seva Medal to Lieutenant General Anil Kumar Bhatt

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పేందుకు ఉగ్ర‌వాద నిరోధ‌క కార్య‌క‌లాపాల‌ను విజ‌య‌వంతంగా చేప‌డుతున్న లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ కుమార్ భ‌ట్‌కు ఉత్త‌మ్ యుద్ధ్‌ సేవా మెడ‌ల్ ద‌క్కింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ఈ అవార్డును అనిల్ కుమార్‌కు ప్ర‌దానం చేశారు. ఢిల్లీలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ప్ర‌దీప్ కుమార్ పాండాకు మ‌ర‌ణాణంత‌రం కీర్తిచ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. క‌శ్మీర్ ఆప‌రేష‌న్‌లో ప్ర‌దీప్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అయితే కానిస్టేబుల్ ప్ర‌దీప్ భార్య ఇవాళ రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా కీర్తి చ‌క్ర అవార్డును అందుకున్నారు. భార‌తీయ ఆర్మీకి చెందిన సిపాయి విజ‌య్ కుమార్‌కు కూడా మ‌ర‌ణాణంత‌రం కీర్తి చ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. విజ‌య్ కుమార్ భార్య ఆ అవార్డు అందుకున్నారు.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles