ప‌ద్మ‌శ్రీ అందుకున్న ఛాయ్‌వాలా

Sat,March 16, 2019 11:25 AM

President Ram Nath Kovind confers Padma Shri award to tea seller D Prakash Rao of odisha

హైద‌రాబాద్: రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ఢిల్లీలో ప‌ద్మా అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఒడిశాకు చెందిన ఛాయ్‌వాలా డీ ప్ర‌కాశ్ రావు.. రాష్ట్ర‌ప‌తి చేతుల మీద‌గా ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు. క‌ట‌క్‌కు చెందిన ఛాయ్ అమ్మే ప్ర‌కాశ్‌.. త‌న‌కు వ‌చ్చిన డ‌బ్బుతో ఓ స్కూల్‌ను న‌డుపుతున్నాడు. ఆ స్కూల్‌లో పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌ను అందిస్తున్నాడు. సామాజిక సేవ విభాగంలో ప్ర‌కాశ్ రావుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. జాన‌ప‌ద గాయ‌ని తీజ‌న్ భాయ్‌.. రామ్‌నాథ్ చేతుల మీదుగా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును అందుకున్నారు. ప‌ద్మ భూష‌ణ్ అందుకున్న‌వారిలో ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ్‌, వాణిజ్య‌వేత్త మ‌హ‌స్య ధ‌ర్మ‌పాల గులాటీ, ప‌ర్వ‌తారోహ‌కురాలు బ‌చేంద్రి పాల్‌లు ఉన్నారు. ఇక ప‌ద్మ‌శ్రీ అందుకున్న‌వారిలో హీరో మ‌నోజ్ బాజ్‌పాయి, త‌బ‌లా ఆర్టిస్ట్ స‌ప్నా చౌద‌రీ, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ సునిల్ ఛ‌త్రి, ఆర్చ‌రీ క్రీడాకారిణి బంబేలా దేవి, ప‌బ్లిక్ అఫైర్స్‌లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ ప్ర‌శాంతి సింగ్‌లు ఉన్నారు.

1926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles