ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్ల నియామకం

Sat,September 30, 2017 10:42 AM

President Ram Nath Kovind appoints governors for various states

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడు గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బి.డి. మిశ్రా, బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ నియామకం అయ్యారు. అండమాన్, నికోబార్ దీవులు లెఫ్టినెంట్ గవర్నర్‌గా దేవేంద్ర కుమార్ జోషిని నియమించారు. ప్రొఫెసర్ జగదీష్ ముఖి స్థానంలో దేవేంద్ర కుమార్ జోషి నియామకం అయ్యారు. జగదీష్ ముఖిని అసోం గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ నియమించబడ్డారు. పురోహిత్ గతంలో అసోం, మేఘాలయ రాష్ర్టాలకు గవర్నర్‌గా పని చేశారు. విదర్భ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1977లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. మూడు సార్లు నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం 1911లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన హితవాద ఇంగ్లీష్ డెయిలీ న్యూస్ పేపర్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్,

బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ను నియమించారు. ఈయన కేంద్ర మంత్రిగా ఆరు నెలల పాటు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బీడీ మిశ్రాలను నియమించారు. ఈయన ఎన్‌ఎస్‌జీ కమాండోగా పనిచేశారు. 1993లో అమృత్‌సర్‌లో జరిగిన విమాన హైజాక్ అపరేషన్‌లో పాల్గొన్నారు. 1962 చైనా వార్‌లో, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 1987-88లో శ్రీలంక ఎల్‌టీటీఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కార్గిల్ వార్ అనంతరం వాలంటరి రిటైర్‌మెంట్ తీసుకున్నారు.

అండమన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషిని నియమించారు. ఈయన 2012 నుంచి 2014 వరకు చీఫ్ నావెల్ స్టాఫ్‌గా పనిచేశారు. 1996 నుంచి 1999 వరకు సింగపూర్ ఇండియన్ హైకమిషన్‌లో డిఫెన్స్ అడ్వైజర్‌గా పనిచేశారు.

అంతకు ముందు ఈ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ జగ్దీశ్ ముఖిని అసోం గవర్నర్‌గా నియమించారు.

5128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles