సీఐసీగా సుధీర్ భార్గవ ప్రమాణస్వీకారం

Tue,January 1, 2019 03:01 PM

President Ram Nath Kovind administers the oath of office to Sudhir Bhargava as the CIC

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ (సీఐసీ)గా సుధీర్ భార్గవ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్ భార్గవ చేత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరయ్యారు. సుధీర్ భార్గవతో పాటు మరో నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి ఎన్‌కే గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్‌చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమించారు.1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles