నవ భారత నిర్మాణమే లక్ష్యం : రాష్ట్రపతి

Thu,January 31, 2019 11:30 AM

President Ram Nath Kovind addresses both Houses of the Parliament  Budget Session

న్యూఢిల్లీ : నవభారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. గత నాలుగేళ్లుగా నవభారత నిర్మాణం కోసం మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. నాలుగేళ్లలో మా ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చింది. ఈ ఏడాది జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సరికొత్త భారత్‌ ఆవిష్కరణే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తున్నాం. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాం. గాంధీజీ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నాం. పేదల జీవితాలను బాగు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. పేదరిక నిర్మూలన, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. 2019 భారత రాజకీయాల్లో కీలక సంవత్సరం.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. స్వచ్ఛ భారత్‌ నిర్మాణంలో భాగంగా 9 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసింది. మరుగుదొడ్ల నిర్మాణాల ద్వారా 3 లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరింది. మహిళల ఆత్మగౌరవం కూడా పెరిగింది. కట్టెల పొయ్యితో వంట చేస్తూ అనారోగ్యం బారిన పడే మహిలలను రక్షించేందుకు ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది. పేదల ఆరోగ్య రక్షణ కోసం ఖర్చులతో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఔషధాల ఖర్చు తగ్గించేందుకు జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేసింది. కిడ్నీ బాధితులకు ప్రత్యేక బీమా యోజన తీసుకొచ్చింది. వీరి కోసం ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలు నెలకొల్పాం.

పలు రాష్ర్టాల్లో కొత్తగా ఎయిమ్స్‌ ఏర్పాటు చేశాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్ష మందికి నివాస యోగ్యం కలిగింది. గృహ నిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టం అమల్లోకి తెచ్చాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 18 వేలకు పైగా గ్రామాల్లో విద్యుద్దీకరణ తెచ్చాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగుల కోసం సౌకర్యవంతమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. దివ్యాంగులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు.

607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles