నోబెల్‌ విజేతలను అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్‌..

Mon,October 14, 2019 10:45 PM

హైదరాబాద్‌: ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతికి ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ, అతడి భార్య ఎస్టర్‌ డఫ్లో కూడా ఉన్నారు. నోబెల్‌ ప్రైజ్‌కు ఎంపికైన అభిజిత్‌ సహా ఎస్టర్‌ డఫ్లో, మైకేల్‌ క్రెమర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన అభిజిత్‌ బెనర్జీ, ఈస్తర్‌ డుఫ్లో, మైఖేల్‌ క్రీమర్‌కు అభినందనలు. ప్రపంచలోని పేదరికాన్ని నిర్మూలించడానికి వారు చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి తెలిపారు. పేదరికంపై యుద్ధం చేయడానికి వారి రీసెర్చి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ప్రధాని ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నోబెల్‌ ప్రైజ్‌ పొందిన అభిజిత్‌ బెనర్జీకి అభినందనలు అని తెలిపారు. ఆయనతో పాటు రీసెర్చిలో భాగమైన ఈస్తర్‌, మైఖేల్‌ క్రీమర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వారి పరిశోధన పేదరికాన్ని నిర్మూలించేందుకు సాయపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. భారత సంతతికి చెందిన అభిజిత్‌కు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్‌లో మేధా సంపత్తి గల వారు కోకొల్లలు. వారిని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టిస్తారని సీఎం అన్నారు. ప్రతి రంగంలోనూ భారతీయులు అద్భుతాలు సృష్టిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.








482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles