ఎండ తీవ్రత చెప్పడానికి ఈ వీడియోలు చాలదూ..!

Sat,May 4, 2019 08:07 PM

preparing dosa on scooty seat with summer effect

అబ్బబ్బ.. ఏం ఎండరా బాబు.. చంపేస్తోందిపో. మధ్యాహ్నం పూట బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది. ఏం ఎండ ఇది. నిప్పుల కొలిమిలా ఉంది. ఇంత ఎండను ఎప్పుడూ చూడలేదు బాబోయ్.. అంటూ బయట కాలు పెట్టడానికే వణికిపోతున్నారు జనాలు. అవునా.. నిజంగా అంత ఎండ ఉందా? అంటే నిజమే ఎండ దంచికొడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంకా ముందుంది మొసళ్ల పండుగ. ఇది మే ప్రారంభం మాత్రమే.

అయితే.. కొంతమంది ఆకతాయిలు... ఎండ తీవ్రతను చెప్పడం కోసం స్కూటీ సీటు మీద దోసలను పోశారు. దోస కూడా ఏం చక్కా స్కూటీ సీటు మీదే రెడీ అయిపోయింది. మరోవైపు ఓ మహిళ ఎండతో బజ్జీలు చేసేసింది. మూకుడులో నూనె పోసి.. ఆ మూకుడును కాసేపు ఎండలో పెట్టి తర్వాత వేడి వేడి బజ్జీలు చేసింది. ఈ వీడియోలు నిజమా? అబద్ధమా? అనేది పక్కనబెడితే.. ఎండ మాత్రం నిజంగానే దంచికొడుతోంది.. అని చెబుతున్నారు నెటిజన్లు.
4007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles