ప్ర‌ణ‌బ్‌ అసాధార‌ణ రాజ‌నీత‌జ్ఞుడు: ప్ర‌ధాని మోదీ

Fri,January 25, 2019 09:26 PM

Pranab is an outstanding statesman, tweets Modi


న్యూఢిల్లీ : మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, మ్యూజిక్ మాస్ట్రో శ్రీ భూపేన్ హ‌జారికా, సామాజిక కార్య‌క‌ర్త నానాజీ దేశ్‌ముఖ్‌ల ఇవాళ భార‌త ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. దీనిపై ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ నాటి కాలంలో ప్ర‌ణ‌బ్ అసాధార‌ణ రాజ‌నీత‌జ్ఞుడు అని అన్నారు. ఎన్నో ద‌శాబ్ధాలు నిస్వార్థ‌రంగా ఆయ‌న దేశానికి సేవ చేశార‌న్నారు. దేశాభివృద్ధిపై ఆయ‌న ప్ర‌త్యేక ముద్ర‌వేశార‌న్నారు. అమోఘ‌మైన జ్ఞానం క‌లిగిన వ్య‌క్తి అని, ప్ర‌ణ‌బ్‌కు ఈ అవార్డుతో స‌త్క‌రించ‌డం సంతోషంగా ఉంద‌ని మోదీ ట్వీట్ చేశారు.




భూపేన్ హ‌జారికా సంగీతం, పాట‌లు ఎన్నో త‌రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని మోదీ అన్నారు. ఆయ‌న సంగీతం సామ‌ర‌స్యాన్ని, సోద‌ర‌భావాన్ని ప్ర‌జ‌ల్లో నింపింద‌న్నారు. భార‌తీయ సాంప్ర‌దాయ మ్యూజిక్‌ను ఆయ‌న విశ్వ‌వ్యాప్తం చేశార‌న్నారు. భూపేన్‌కు భార‌త‌ర‌త్న ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌న్నారు.



గ్రామీణ అభివృద్ధి కోసం నానాజీ దేశ్‌ముఖ్ అద్భుత‌మైన చేయూత‌నిచ్చార‌ని ప్ర‌ధాని అన్నారు. త‌న సేవా గుణంతో గ్రామీణుల‌కు కొత్త జ‌వ‌స‌త్వాల‌ను ఇచ్చార‌న్నారు. అణ‌గారిన ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ఆదుకున్న తీరు అసాధార‌ణ‌మ‌న్నారు. నానాజీ నిజ‌మైన భార‌త ర‌త్న అని మోదీ అన్నారు.


1050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles