చంద్రుడిపై ఒక‌రోజు.. భూమిపై ఎన్ని రోజులు ?

Fri,September 6, 2019 05:28 PM

హైద‌రాబాద్‌: విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన సుమారు మూడు గంట‌ల త‌ర్వాత చంద్రుడిపై రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ దిగుతుంది. అయితే రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ చంద్రుడిపై ఎంత కాలం ప‌నిచేస్తుందో తెలుసా. అది చంద్రుడి కాల ప్ర‌మానం ప్ర‌కారం దాని ఉప‌రిత‌లంపై ఒక రోజు పని చేస్తుంది. అంటే అది భూమిపై 14 రోజుల‌తో స‌మానం. ఆ స‌మ‌యంలో రోవ‌ర్ ప‌లు ప‌రీక్ష‌లు చేప‌డుతుంది. కానీ ప్ర‌జ్ఞాన్‌ లో ఉన్న ప్ర‌ధాన ఆర్బిట‌ర్ మాత్రం క‌నీసం ఏడాది పాటు వివిధ అధ్య‌య‌నాలు చేయ‌నున్న‌ది. ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌లు.. దేశానికి చెందిన చిహ్నాల‌ను మోసుకువెళ్తున్నాయి. అవి శాశ్వ‌తంగా అక్క‌డే ఉండ‌నున్నాయి. రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ కు మొత్తం ఆరు వీల్స్ ఉన్నాయి. రెండు దిక్కుల మూడేసి వీల్స్ ఉంటాయి. ఒక చ‌క్రంపై అశోక చ‌క్ర చిహ్నం ఉంటుంది. మ‌రోవైపు ఉన్న వీల్స్‌పై ఇస్రో చిహ్నం ఉంటుంది. అయితే రోవ‌ర్ దిగే ల్యాండ‌ర్ ర్యాంప్‌పై జాతీయ జెండా ఉంటుంది.

5952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles