ఉత్కంఠం.. ప‌వ‌ర్ డిసెంట్ ఆప‌రేష‌న్ ప్రారంభం

Sat,September 7, 2019 01:41 AM


హైద‌రాబాద్‌: చ‌ంద్ర‌యాన్‌2 ప్రాజెక్టులో అత్యంత కీల‌క‌మైన ప‌వ‌ర్ డిసెంట్ ఆప‌రేష‌న్ మొద‌లైంది. 4 లిక్విడ్ ఇంజిన్ల ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది. ఆల్టిట్యూడ్‌ 32 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి ప‌వ‌ర్ డిసెంట్ ఆప‌రేష‌న్ మొద‌ల‌వుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 1.38 నిమిషాల‌కు ఈ ఆప‌రేష‌న్ ప్రారంభ‌భం అయ్యింది. దీంట్లో 30 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి 7.5 కిలోమీట‌ర్ల ఎత్తుకు వ‌స్తుంది. రెండ‌వ ద‌శ‌లో 5 కిలోమీట‌ర్ల ఆల్టిట్యూడ్‌కు తీసుకువ‌స్తారు. ఆ త‌ర్వాత మూడ‌వ ద‌శ‌లో చంద్రుడి మీద‌కు విక్ర‌మ్ ల్యాండ‌ర్ మ‌రింత క్లోజ్‌గా వ‌స్తుంది. ఆ త‌ర్వాత వ‌ర్టిక‌ల్‌గా ల్యాండ‌ర్ క్ర‌మ‌క్ర‌మంగా చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగుతుంది. నాలుగు ప్రొప‌ల్స‌న్ ఇంజిన్లు ఈ స‌మ‌యంలో ప‌నిచేస్తాయి. ఇంజిన్ స్పీడ్‌ను పెంచ‌డంలో.. త‌గ్గించ‌డంలో ఈ ఇంజిన్లు ప‌నిచేస్తాయి. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ ప్ర‌క్రియ చేప‌డుతారు.1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles