వందల కోట్ల విలువైన ఆలుగడ్డలు రోడ్లపై పడేశారు!

Thu,December 7, 2017 02:10 PM

Potatoes worth crores dumped on streets in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక.. అటు కోల్డ్ స్టోరేజ్‌ల కిరాయి కట్టలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆలుగడ్డ పండించే రైతుల బాధ వర్ణణాతీతం. ధరలు దారుణంగా పడిపోయాయి. ఏడాది కాలంలో రాష్ట్రంలో 12 లక్షల క్వింటాళ్ల ఆలుగడ్డలను పండించారు. అందులో 6.5 లక్షల క్వింటాళ్లను కోల్డ్ స్టోరేజ్‌లో దాచారు. ధరలు ఏమాత్రం పెరగకపోవడంతో ఇందులో 60 శాతం ఆలుగడ్డలు స్టోరేజ్‌కే పరిమితమయ్యాయి. పంటకు ధర పడిపోవడంతో రైతులు కిరాయి చెల్లించడం లేదు. దీంతో కోల్డ్ స్టోరేజ్ యజమానులు వాటిని తీసుకెళ్లి రోడ్లపై పారబోస్తున్నారు.

ఒక్క ఫరూకాబాద్‌లోనే సుమారు రూ.200 కోట్ల విలువైన ఆలుగడ్డలను స్టోరేజ్ యజమానులు పడేశారు. కొన్ని చోట్ల స్టోర్ చేయడానికి యజమానులు ఒక్కో క్వింటాలుకు రూ.220 వసూలు చేస్తున్నారు. ఇవి కట్టలేక రైతులు పంటను వాళ్లకే వదిలేస్తున్నారు. ఇప్పుడున్న ధరకు అమ్మితే తమకు ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. తమ దగ్గర ఉన్న ఆలుగడ్డలను అమ్మినా తమకు రావాల్సిన కిరాయి కూడా రాదని అర్థం చేసుకున్న స్టోరేజ్ యజమానులు వాటిని పడేస్తున్నారు. సాధ్యమైనంత వరకు అమ్మేస్తూ.. మిగిలిన వాటిని అలాగే వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS