తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రెచ్చ‌గొడుతున్నాడు..!

Sat,March 23, 2019 05:16 PM

Posani Krishna Murali Fires on Pawan Kalyan over His Comments on telangana

హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టారు. మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. పవన్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రెచ్చ‌గొడుతున్నాడు. రెండు రాష్ర్టాల మధ్య అనవసరంగా చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. సెటిలర్లను తరిమి కొడితే మీరు వస్తారా?.. రారు. తెలంగాణ ప్రజల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పింది ఎవరు? కేసీఆర్ ప్రశంసించింది ఎవరు?. కేసీఆర్ ఆంధ్రుల భూముల్ని లాక్కుంటున్నారా? అని పోసాని ప్రశ్నించారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ పొగిడి.. ఇప్పుడు జగన్ తిడుతున్నారు. పవన్ మాటల వల్ల వైషమ్యాలు పెరిగితే ఎవరిది బాధ్యత? ఆంధ్రజ్యోతి రాయగానే వాస్తవాలు చూడకుండా పవన్ స్పందిస్తే ఎలా? ఎక్కడ ఆంధ్రవాల్లను కొట్టారు? ఎక్కడ బెదిరించారు? దయచేసి ఏపీ ఓటర్లు తప్పుడు వార్తలు నమ్మొద్దు. హైద‌రాబాద్‌లో తెలంగాణ-ఆంధ్రావాళ్లు బ్రహ్మాండంగా కలిసి ఉన్నారు. టీడీపీ నేతలను బెదిరించారని అంటున్నారు కదా.. ఒక్క పేరు చెప్పండి. మీరు బిజీగా ఉంటే ఆ ఫైల్ నాకివ్వండి, స్టేషన్ నేను వెళ్తా. కేసీఆర్ వాటేసుకుని గొప్ప ముఖ్యమంత్రి అన్నావు కదా అని పోసాని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ ఇలా వంకర మాటలు మాట్లాడొద్దు. నేను హైదరాబాద్ వచ్చి 36ఏళ్లు అయింది. హైదరాబాద్ ఆంధ్రావాళ్లు ప్రశాంతంగా ఉన్నారు. నా దృష్టిలో తెలంగాణ ప్రజలు దేవుళ్లు. తెలంగాణ వాళ్లు నన్ను చిన్నమాట కూడా అనలేదు. తెలంగాణ బిడ్డలకు ఒక్క టీ ఇస్తే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణ నాయకులు కూడా ఆత్మీయంగా ఉంటారు. పవన్ కల్యాణ్ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి.. ఎవరైనా లాక్కున్నారా?. అలాగే పవన్ అన్న చిరంజీవి ఆస్తులను ఎవరైనా కబ్జా చేశారా? పవన్ చెప్పేదంతా అబద్ధం, నాటకం. మేమంగా ఇక్కడ క్షేమంగా ఉన్నాం. లేనిపోని విద్వేషాలు సృష్టిస్తే రేపు ఇక్కడ మా బతుకులేంటి. అని పోసాని మండిపడ్డారు.

3709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles