లోక్‌స‌భ తొలి విడ‌త‌.. ముగిసిన పోలింగ్‌

Thu,April 11, 2019 05:15 PM

polls for first phase of lok sabha closed at 5 pm today

హైద‌రాబాద్: ఇవాళ లోక్‌స‌భ తొలి విడత‌కు జ‌రిగిన పోలింగ్ ముగిసింది. దేశ‌వ్యాప్తంగా తొలి ద‌శ‌లో భాగంగా 20 రాష్ట్రాల్లో మొత్తం 91 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రిగింది. సాయంత్రం అయిదు గంట‌ల‌కు పోలింగ్ ముగిసింది. అయితే తెలంగాణ‌లోని నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉన్న ఓట‌ర్ల‌కు గ‌డ‌వు స‌మ‌యం ముగిసినా.. వారికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. నాగాలాండ్‌లో అత్య‌ధికంగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 68 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. తెలంగాణ‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 48.95 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది.

1479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles