బెంగళూరు : కర్ణాటకలోని చామరాజనగర్ పోలింగ్ కేంద్రం వద్ద విషాదం నెలకొంది. పోలింగ్ బూత్ నంబర్ 48 వద్ద విధుల్లో ఉన్న ఓ పోలింగ్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడిని శాంతమూర్తిగా పోలీసులు గుర్తించారు. హనూరులోని ఓ కాలేజీ ప్రిన్సిపాల్‌గా శాంతిమూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటకలో 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.