ఆరో దశ వరకు 67.37 శాతం పోలింగ్ : ఈసీ

Sun,May 19, 2019 05:51 PM

Polling has concluded in 542 parliamentary constituencies across states and union territories

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. 542 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా కోటి 80 లక్షల మంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ ఎన్నికల వరకు 67.37 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటేశారని తెలిపారు. ఎన్నికల విధుల్లో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles