1967లో పోలింగ్ బూత్ ఎలా ఉండేదో తెలుసా?

Thu,April 18, 2019 12:49 PM

ఇది ఎన్నికల సీజన్. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రస్తుతం నడుస్తోంది. అన్ని విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అప్పటి దాకా సార్వత్రిక ఎన్నికల మీదే చర్చ. అది సోషల్ మీడియా అయినా.. ట్రెడిషనల్ మీడియా అయినా.. ఇంకేదో మీడియా అయినా.. అందరూ కాబోయే ప్రధాని ఎవరు? ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అంటూ చర్చించుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎన్నికల కమిషన్ గురించి, ఈవీఎంల గురించి, తమ ఓటు ఓటర్ లిస్టులో ఉందా? లేదా? ఈవీఎంలో ఓటు ఎలా వేయాలి. ఓటర్ ఐడి కార్డు ఎలా తీసుకోవాలి. వీవీప్యాట్ స్లిప్ అంటే ఏంటి? ఇదిగో ఇలా ఓటేసే ముందు ప్రతి ఒక్కరికి వచ్చే సందేహాలు ఇవన్నీ.


ఇప్పుడంటే పోలింగ్ కేంద్రాలను స్కూళ్లలో కానీ లేదా ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్స్‌లో కానీ పెడుతున్నారు. మరి.. 1967లో పోలింగ్ ఎక్కడ జరిగేది. 1967 అంటే 52 ఏళ్ల కింద.. ఊళ్లలో పోలింగ్ ఎక్కడ జరిగేదో తెలుసా? గుడిసెల్లో జరిగేదట. దానికి ప్రూఫ్ కావాలా? మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ఓ పోలీస్ పోలింగ్ కేంద్రం ముందు నిలబడి ఉన్నాడు. ఓటర్లు ఓటేసేందుకు క్యూ కట్టారు. 1967 లో పోలింగ్ బూత్ ఇలా ఉండేది అంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles