హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రేపోమాపో నోటిఫికేషన్‌!

Wed,September 11, 2019 03:29 PM

Poll dates for Maharashtra and Haryana assemblies soon and Jharkhand to vote later

హైదరాబాద్‌ : హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే మొదట్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక జార్ఖండ్‌లో డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నందున పటిష్ట చర్యల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్రలో దీపావళి కంటే ముందే ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాలకు 2014లో అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్‌ 20న నోటిఫికేషన్‌ రాగా, అక్టోబర్‌ 15న పోలింగ్‌, 19 ఫలితాలు వెలువడ్డాయి. జార్ఖండ్‌కు 2014లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23వ తేదీ వరకు కొనసాగాయి.

587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles