సుప్రీంకోర్టుకు చేరిన మరాఠా రాజకీయం..

Tue,November 12, 2019 04:36 PM

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయం ఆఖరికి సుప్రీంకోర్టుకు చేరింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంపై శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ బీజేపీకి 48 గంటల సమయం ఇవ్వడం, ఇతర పార్టీలకు(శివసేన, ఎన్సీపీ) 24 గంటల సమయం ఇవ్వడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 24 గంటలు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి విన్నవించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని శివసేన ఆరోపించింది. గడువు కోరితే గవర్నర్ తిరస్కరించారని శివసేన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాగా, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేశారు. ఎన్సీపీకి ఇచ్చిన గడువు (ఈరోజు రాత్రి 8.30 గంటలు) ముగిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు గవర్నర్ తెలిపారు. దీంతో, గందరగోళానికి గురైన శివసేన, ఎన్సీపీలు గవర్నర్ ప్రకటనపై మండిపడుతున్నాయి. ఎన్సీపీ నేతలు.. కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

1527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles