ఐదు రోజుల పసిపాపను ఎత్తుకెళ్లారు..

Thu,May 9, 2019 10:47 AM

Police has arrested a 50 yr old woman in Pollachi for lifting a infant

చెన్నై : తమిళనాడులోని పొలచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల పసిపాపను ఇద్దరు వ్యక్తులు కలిసి ఎత్తుకెళ్లారు. పాపను ఎత్తుకెళ్లిన విషయాన్ని తల్లి గ్రహించి ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ ఫుటేజీ ద్వారా పాపను ఎత్తుకెళ్లిన 50 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లికి అప్పగించారు. ఆ తర్వాత నిందితురాలిని కోయంబత్తూరు సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు.

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles