ఉగ్రవాది నవీద్‌కు ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్

Sat,August 8, 2015 02:33 PM

Police arrest man who gave shelter to captured Pakistani terrorist Naveed in South Kashmir

న్యూఢిల్లీ : ఉగ్రవాది నవీద్‌ను మూడు రోజుల క్రితం భారత సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. నవీద్‌కు దక్షిణ కశ్మీర్‌లో ఆశ్రయమిచ్చిన వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇవాళ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎన్‌ఐఏ ఆ వ్యక్తిని విచారిస్తోన్నారు. కశ్మీర్‌లో రెండు నెలల నుంచి తల దాచుకుంటున్నానని నవీద్ చెప్పిన విషయం విదితమే. ఈ రెండు నెలల కాలంలో నవీద్ ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీద్‌తో పాటు వచ్చిన మరో ఉగ్రవాది భారత సైన్యం కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.

1346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles