స్కూల్ బస్సుపై దాడి.. 18 మంది అరెస్ట్

Thu,January 25, 2018 02:21 PM

Police arrest 18 suspects who involved in attack on School Bus

గురుగ్రామ్‌ః పద్మావత్ మూవీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో స్కూల్ బస్సుపై దాడి చేసిన కేసులో 18 మందిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సుపై రాళ్లు విసిరిన వాళ్లలో ఈ 18 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లను ఓ స్థానిక కోర్టులో హాజరు పరచనున్నారు. స్థానిక జీడీ గోయెంకా స్కూల్‌కు చెందిన పిల్లలను ఈ బస్సు తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు స్కూల్ బస్సుపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌పుత్ కర్ణిసేన స్పష్టంచేసింది. రాజ్‌పుత్‌లు ఎప్పుడూ స్కూల్ బస్సుపై దాడి అన్న ఆలోచన కూడా చేయరు. తమ శాంతియుత ఆందోళనను బలహీన పరచాలన్న ఉద్దేశంతో కొందరు రాజకీయ నేతలు వేసిన ఎత్తుగడ ఇది అని కర్ణిసేన చెప్పింది. ఎవరు రాళ్లు విసిరారో తెలియదు కాబట్టి.. కర్ణిసేనను బాధ్యుల్ని చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.

1289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles