కేరళ అసెంబ్లీని సందర్శించిన స్పీకర్ పోచారం

Thu,August 22, 2019 05:46 PM

pocharam srinivas reddy visits kerala assembly

తిరువనంతపురం: తెలంగాణ అసెంబ్లీ సభాధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కేరళ అసెంబ్లీని సందర్శించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ రాజధాని వెళ్లిన స్పీకర్.. తన పని ముగించుకున్న అనంతరం కేరళ అసెంబ్లీకి వెళ్లారు. స్థానిక అసెంబ్లీ స్పీకర్ పి. రామకృష్ణన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారిరువురూ అసెంబ్లీ అంతా తిరిగి పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, ఇతర అంశాలపై వారి చర్చ కొనసాగింది.
కాగా, కేరళ గవర్నమెంట్ తరఫున శ్రీరామకృష్ణన్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జ్ఞాపిక, పుస్తకాలను బహూకరించారు. కార్యక్రమంలో కేరళ అసెంబ్లీ స్పీకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles