పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ ప్రెస్..

Fri,February 15, 2019 12:10 PM

pmmodi flags off Vande Bharat express

న్యూఢిల్లీ: దేశ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి వందేభారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోనుంది. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెండు రైల్వేస్టేషన్ల వద్ద 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసీ బోగీలను కలిగి ఉంటుంది. ఇందులో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు చెందినవి. ఈ రైలులో 1,128 సీట్లు ఉన్నాయి. ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, సౌకర్యవంతమైన సీట్లు, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు ఇలా ఎన్నో అధునాతన సౌకర్యాలు ఈ రైలులో ప్రయాణికులను ఆకరిస్తాయి. ఈ రైలులో ప్రయాణించే వారికి విమాన ప్రయాణం అనుభూతి కలుగుతుంది.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles