రేపు నాగాలాండ్, మేఘాలయలో ప్రధాని మోదీ ర్యాలీ

Wed,February 21, 2018 05:04 PM

PM to address rallies in  Meghalaya, Nagaland Tomorrow


కోహిమా: ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రేపు రెండు రాష్ర్టాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నాగాలాండ్ రాజధాని కోహిమా నుంచి ట్యుయెన్ సాంగ్ వరకు 360 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంగ్‌సిలుంగ్ తెలిపారు. అక్కడి నుంచి మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్, ఫుల్బరి పట్టణంలో జరుగనున్న క్యాంపెయిన్‌లో పాల్గొంటారని వెల్లడించారు. మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు, నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఓటింగ్ జరుగనుంది.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles