మోదీ అవినీతిపరుడు : రాహుల్ గాంధీ

Thu,October 11, 2018 01:31 PM

PM of India is a corrupt person, alleges Rahul Gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపరుడని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. మోదీ అవినీతిపరుడని, ఆయన అనిల్ అంబానీకి 30వేల కోట్ల ప్రాజెక్టు సమర్పించారని, మోదీ ఎంత అవినీతిపరుడో ఈ కేసు బట్టబయలు చేస్తోందని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అధికారి ఒకరు వెల్లడించిన విషయం ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అనిల్ అంబానీ కంపెనీకే రాఫెల్ ఒప్పందాన్ని ఇవ్వాలని ప్రధాని మోదీ తమతో చెప్పినట్లు డసాల్ట్ కంపెనీ అధికారి ఫ్రాన్స్ వెబ్‌సైట్‌కు తెలిపాడు. దేశ రక్షణ మంత్రి ఎందుకు అకస్మాత్తుగా రాఫెల్ ప్లాంట్‌కు వెళ్లారని రాహుల్ ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌కు వెళ్లారు. డసాల్ట్ కంపెనీకి ఆమె వెళ్లనున్నారు.

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles