రాత్రి 9 గంట‌ల‌కు గ్రిల్స్‌ వ‌ర్సెస్ మోదీ

Mon,August 12, 2019 03:40 PM

PM Nnarendra Modi to feature in  Man Vs Wild show in Discovery channel

హైద‌రాబాద్‌: డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షో అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఆ అడ్వంచ‌ర్ షోలో ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షం కానున్నారు. ఫేమ‌స్ హోస్ట్ బియ‌ర్ గ్రిల్స్‌తో మోదీ సాహ‌సాలు చేయ‌నున్నారు. ఉత్త‌రాఖండ్‌లోని అడ‌వుల్లో షూట్ చేసిన ఈవెంట్‌ను ఇవాళ రాత్రి 9 గంట‌ల‌కు డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పుల అంశాల‌పై ఇద్ద‌రూ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ గ్ర‌హాన్ని ర‌క్షించుకుందాం, శాంతిని పెంచుదాం, స‌డ‌ల‌ని ప‌ట్టుద‌ల‌ను పెంపొందించేందుకు కృషి చేద్దామ‌నే సందేశాన్ని ఇవాళ గ్రిల్స్‌ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షోను త‌ప్ప‌కుండా చూడాల‌న్నారు.2010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles